»Cm Ys Jagan And Ys Bharathi Listening Ugadi Panchangam 2023
Ugadi panchangam 2023: పంచాంగ శ్రవణం విన్న జగన్ దంపతులు
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంపతులు ఉగాది పచ్చడిని స్వీకరించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు (ugadi panchangam 2023) జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో (Tirupati Ananda Nilayam) ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో (Panchanga Sravanam) జగన్ దంపతులు ( YS Jagan, YS Bharati Reddy) పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంపతులు ఉగాది పచ్చడిని (Ugadi Pachadi) స్వీకరించారు.
మనం బాగుండాలి… ఈ సమాజం బాగుండాలని ఈ కొత్త సంవత్సరం రోజున అందరూ దేవుడిని పూజిస్తారని చెప్పారు. మనం శోభకృతు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, రాబోయే ఏడాది అంతా శుభప్రదంగా, శోభాయమానంగా ఉంటుందనే భావన కలుగుతుందన్నారు. అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయన్నారు. కార్మికులు, కర్షకులు ఈ సంవత్సరం లాభదాయకంగా కనిపిస్తారన్నారు. పరిపాలకుల మధ్య స్నేహం బాగుంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్నేహం బాగా ఉండి, అలాగే, ప్రజల మధ్య స్నేహభావం పెరిగి సుఖశాంతులతో ఉంటారని చెప్పారు. కష్టపడే వారందరికీ లాభదాయక ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ శుభపరిణామాలు అనుభవిస్తారని, ప్రజలకు మంచి చేకూరుతుందన్నారు. పర్వత ప్రాంత పంటలకు, వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉందన్నారు. ఆర్గానిక్ పంటలు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయన్నారు.
ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉండటం వల్ల, వారు బలంగా పుంజుకుంటారన్నారు. వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అక్టోబర్ వరకు అప్పుడప్పుడు ఆర్థిక చికాకులు రావొచ్చునని చెప్పారు. ఆ తర్వాత నుండి అనుకూలంగా ఉందని, ఆర్థిక రంగం, బ్యాంకింగ్ రంగం బలపడతాయన్నారు. సంప్రదాయ వృత్తుల్లోని వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. రక్షణ శాఖ బాగా పని చేయడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉంటారన్నారు. పరిశ్రమలు, రియల్టీ, నిర్మాణ రంగాలు సానుకూలంగా ఉంటాయన్నారు.