ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయగా..అందుకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లాలో నారా లోకేష్(nara Lokesh) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన యువగళం పాదయాత్రలో భాగంగా ఉన్న ప్రాంతంలోనే కూర్చుని నిరసన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నారా లోకేష్ దగ్గరకు చేరి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన విరమించాలని కోరుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడిని నంబర్ వన్ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు సీఐడీ శాఖ, ఇతరులు నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది ప్రారంభమైంది. ఆపై వారికి స్కిల్ డెవలప్మెంట్ పోటీ స్కామ్‌పై నోటీసు కూడా వచ్చింది. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు.
నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు స్వయంగా నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 4వ తేదిన ఆయన విచారణకు హాజరుకావాలని సీఐడీ కోరింది.