VZM: రాజాం పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని కాలువలు, రోడ్లపై చెత్త చేరడంతో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆదేశాల మేరకు శానిటేషన్ సిబ్బందితో ఆగమేఘాలపై కాలువలలో మురుగునీటితో కొట్టుకొచ్చిన వ్యర్ధాలను తొలగించారు. అనంతరం వాడుకనీరు కాలువలలో వెళ్లే విధంగా కాలువలను శుభ్రం చేశారు.