కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లిపాలెం గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా మంగళవారం రాత్రి పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న మినీ ఫిషింగ్ హార్బర్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గంగపుత్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను తగ్గేవరకు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.