»Cbi Court Dismissed Uday Kumar Bail Application In Ys Viveka Murder Case
Viveka Case : వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైఎస్ జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు(YS Viveka murder case) ఓ పట్టాన తేలేటట్టులేదు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి(Gajjala Udaykumar Reddy)కి సీబీఐ కోర్టు(CBI COURT) షాక్ ఇచ్చింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
Viveka Case : వైఎస్ జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు(YS Viveka murder case) ఓ పట్టాన తేలేటట్టులేదు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి(Gajjala Udaykumar Reddy)కి సీబీఐ కోర్టు(CBI COURT) షాక్ ఇచ్చింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని ఆరు రోజుల పాటు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించింది. ప్రస్తుతం గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ పై ఉన్నారు. ఇటీవల ఉదయ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది.
వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించిన తర్వాతనే అతడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పేర్కొంది. హత్యా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు వివేకా హత్య 2019లో జరిగిందని.. నాలుగేళ్లపాటు విచారణ జరిగిందని ఉదయ్‌కుమార్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఉదయ్ కుమార్ రెడ్డి నెల రోజుల క్రితమే అరెస్టు చేశామని.. అతడు జైలులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. మే 11న ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.