Rakul preet singh: షాకింగ్ కామెంట్.. రకుల్ అక్కడ సర్జరీ చేయించుకో..!
సోషల్ మీడియా పుణ్యమా అని.. హీరోయిన్ల పై వచ్చే కామెంట్స్ మామూలుగా ఉండవు. ఎలాంటి ఫోటో షూట్స్ షేర్ చేసినా.. నెటిజన్స్ చేసే కామెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కామెంట్సే కాదు ట్రోలింగ్ కూడా అంతకు మించి ఉంటుంది. తాజాగా హాట్ బ్యూటీ రకుల్ పై నెటిజన్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరును తెలుగు తెరపై చూసి చాలా రోజులే అవుతున్నాయి. తెలుగు ఆడియెన్స్ దాదాపుగా ఈ ముద్దుగుమ్మను మరిచిపోయినట్టే. టాలీవుడ్లో పట్టించుకోవడం లేదని.. బాలీవుడ్‌కి వెళ్లింది రకుల్. అక్కడ కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. దాంతో ప్రస్తుతం ఫిట్నెస్ బిజినెస్, హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు రకుల్ చేసే గ్లామర్ షో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. అయితే రీసెంట్గా రకుల్ చేసిన ఫోటో షూట్ పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు బికినీలో తను చలిలో వణుకుతూ.. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. అయితే దీని తర్వాత కేవలం నాభి అందాలనే హైలెట్‌గా చేస్తూ.. కొన్ని ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.
బ్లాక్ డ్రెస్‌తో బాడీ మొత్తం కవర్ చేసిన రకుల్.. నడుమును మాత్రం సోషల్ మీడియా వీక్షకులకు వదిలేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు. నాభికి సర్జరీ చేయించుకో.. అది ముడుచుకు పోయినట్టుగా ఉంది.. ఓపెన్ చేయించుకో.. అందంగా కనిపించడం లేదు.. అని కామెంట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్స్‌కు దిమ్మ తిరిగిపోయింది. మరి రకుల్‌కు ఇంకెలా అనిపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికైతే.. మిగతా హీరోయిన్ల కంటే రకుల్ నాభి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. గతంలోనే దాన్ని సవరించుకునేందుకు రకుల్ సర్జరీ చేయించుకోబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చూసిన తర్వాత.. రకుల్ నిజంగానే తన బొడ్డుకి సర్జరీ చేయించుకుంటుందేమో చూడాలి.