AKP: కోటవురట్ల శివారు రాజపేట ప్రాథమికోన్నత పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వేషధారణలలో విద్యార్థులు అలరించారు. హెచ్ఎం నానిమణి మోహన్ మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు సదా ఆచరణీయం అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన కరుణామయుడు యేసు క్రీస్తుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత, రాజు, తదితరుతు పాల్గొన్నారు.