NTR: విద్యార్థుల కేరింతలు, విచిత్ర వేషధారణలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, మట్టితో బొమ్మలు వంటి ప్రదర్శనలతో తిరువూరు బాలోత్సవం సందడి సందడిగా జరిగింది.ఈ బాలోత్సవంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒత్తిడికి దూరంగా ఆనందంగా గడపడానికి సృజనాత్మకతను పెంచుకోవడానికి, నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి ఈ బాలోత్సవాలు ఉపయోగపడతాయని తెలిపారు.