E.G: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను ఈనెల 5, 6, 7 తేదీలలో పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ రామకృష్ణ శనివారం తెలిపారు. గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం, శివరామపట్నం, ఠాగూర్ పాలెం గ్రామాలకు చెందిన 1750 పుస్తకాలను సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.