ATP: నిషేధిత ప్లాస్టిక్ పై యుద్ధం ఆగలేదని.. మరో 3 నెలల్లో మార్పు చూపిస్తానని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగించరాదని ప్రజలు, షాప్ యజమానులకు అవగాహన కల్పించామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించమని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పారు.