BPT: అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవోపై అక్కడ నేతలు దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని బాపట్ల ఎంపీడీవో బాబురావు అన్నారు. శనివారం బాపట్ల మండల పరిషత్ కార్యాలయంలో దాడి ఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.