ELR: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని DMHO అమృతం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఛాంబర్లో బుధవారం వైద్యాధికారుల కమిటీ సమావేశం జరిగింది. డెకాయ్ ఆపరేషన్లు పటిష్టంగా అమలుపరిచి, స్త్రీ నిష్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలన్నారు.