W.G: జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99వేల మందికి గాను రూ. 55కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.