VZM: విజయనగరం పట్టణం దాసన్నపేటలోని అతి పురాతన శ్రీ చిన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కవచధారణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవెల్లి రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలచే ప్రత్యేక దీపారాధన నిర్వహించారు.