Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ఇప్పటికే వరుస కేసులు ఎదుర్కొంటున్నారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై చంద్రబాబు బాబుపై సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది.
ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో అరెస్టయి ఆయన ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 50 రోజుల రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసు విచారణ కొనసాగుతుండగా సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడును సిఐడి నిందితుడిగా చేర్చింది. ఆ తర్వాత ఏపీ ఫైబర్నెట్ కేసులో ఆయనను సీఐడీ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులతో పాటు అంగళ్లపై దాడి కేసు, విజయనగరంలో కేసు, ఇలా వరుస కేసులు చంద్రబాబు నాయుడును ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీ ఇప్పటికే పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.