CTR: శాంతిపురం మండలంలోని నరసింహపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వెంకట్రామప్ప అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వెంకట్రామప్ప మృతి పార్టీకి తీరని లోటని మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ పేర్కొన్నారు.