ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మాజీ సింగల్ విండో చైర్మన్ బోయళ్ల నారాయణరెడ్డి కనిగిరిలో ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.