SKLM: ఆశాలకు కనీస వేతనాలు, ఒప్పంద జీవోల విడుదల కై మార్చి 6న ఛలో విజయవాడ జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం పాతర్లపల్లి వైద్య ఆరోగ్య శాఖ అధికారి బివి.అనూషకు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలన్నారు.