GNTR: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు అర్బన్ ఎస్సై శ్రీహరి హెచ్చరించారు. పొన్నూరులోని అంబేద్కర్ సెంటర్లో ఓ ఆటోలో శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.