GNTR: కాకుమాను గ్రామ పంచాయతీలో శనివారం ‘స్వర్ణాంధ్ర-మాన్సూన్ హైజీన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా కాలంలో పరిశుభ్రత, నీటి నిల్వలను నిర్వహించడం, అంటు వ్యాధులు వ్యాపించకుండా నిరోధించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి అంశాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో MLA బూర్ల రామాంజనేయులు గ్రీన్ అంబాసిడర్లను సన్మానించారు.