KRNL: ఆదోని మండలంలోని ధనాపురం, చిన్న పెండేకల్లు, గోనబావి గ్రామాలకు చెందిన 75 కుటుంబాలు వైసీపీని వీడాయి. హైదరాబాద్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.