SKLM: సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ బొడ్డువానిపేట గ్రామంలో గత కొంతకాలంగా ఉన్న లో ఓల్టేజి విద్యుత్ సమస్యను శుక్రవారం పరిష్కరించారు. ఈ గ్రామంలో ఓల్టేజితో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు దేపల్లి మోహనరావు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.