ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వాటర్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ MLA కోనప్ప కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఇవాళ కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ముందే చాలి చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న కార్మికులకు 5 నెలల నుంచి వేతనం రావడం లేదన్నారు. పెండింగ్ ESI, PF విడుదల చేసి సమ్మె విరమణ చేయించాలని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.