VZM: సినీ నటుడు సాయికుమార్ తన సొంత గ్రామమైన ఎల్.కోట మండలం కల్లేపల్లికి శనివారం వచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రేగ గ్రామంలో ఉన్న వేదమాత గాయత్రీ దేవి, కాశీ శివలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, స్థానిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కొంతసేపు గడిపారు. అరకులో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.