»Ap Minister Vidadala Rajini Osd Who Beat The Call Centre Employee
Vidadala Rajini OSD: ఉద్యోగిని కొట్టిన మంత్రి రజని ఓఎస్డీ..విపక్షాల ఆగ్రహం
ఏపీలో మంత్రి విడదల రజిని(vidadala Rajini) ఓఎస్డీ, సీఈఓ మధుసూదన్ రెడ్డి మంగళగిరిలోని ఆరోగ్య శాఖలోని కాల్ సెంటర్ ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన విపక్షాలు వైసీపీ నేతల సమక్షంలోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ap Minister vidadala Rajini OSD who beat the call centre employee
ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని(vidadala Rajini) ఓఎస్డీ(OSD) ఓ ఉద్యోగి విషయంలో దురుసుగా ప్రవర్తించారు. మంగళగిరిలో 108 కాల్ సెంటర్ ఉద్యోగిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ, సీఈఓ మధుసూదన్ రెడ్డి కొట్టారు. అయితే శుక్రవారం అందరు చూస్తున్న క్రమంలో ఆయన చేయిచేసుకున్నారు. దీంతో ఆవేదన చెందిన సిబ్బంది దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్ కాల్సి తీసుకోకుండా నిరసన తెలిపారు. ఆ క్రమంలో వచ్చిన అత్యవసర ఫోన్ కాల్స్ కు అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్స్ రాకలో జాప్యం ఏర్పడి రైలు ప్రమాద బాధితుడు మరణించినట్లు వచ్చిన అంశంపై గురువారం సీఎం కార్యాలయం వివరణ కోరింది.
ఆ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఆకస్మాత్తుగా 108 కాల్ సెంటర్ సిబ్బంది(call centre employee) వద్దకు వచ్చి ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని వ్యాఖ్యలు చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అధికారులు చూస్తున్న క్రమంలోనే సిబ్బందిపై చేయిచేసుకున్నారు. ఆ క్రమంలో అప్రమత్తమైన మిగతా అధికారులు సర్ది చెప్పడంతో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా..అత్యవసరంగా కాల్ చేసిన వారికి సమాధానం ఇవ్వడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఉద్యోగిని నిలదీసే క్రమంలో అలా జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన ప్రతిపక్ష నేతలు సిబ్బందిపై అలా ఎలా చేయి చేసుకుంటారని నిలదీస్తున్నారు. పని చేసే ఉద్యోగులకు పద్దతి ప్రకారం చెప్పాల్సిందిపోయి దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వైపీసీ ప్రభుత్వ తీరుతో అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.