ఏపీలో రాజకీయాలు(ap politics) రోజు రోజుకీ హీటెక్కిపోతున్నాయి. ఎన్నికలకు 19 నెలల సమయం ఉండగానే అన్ని పార్టీలు అప్రమత్తమౌతున్నాయి. ఏ పార్టీ తో పొత్తులు పెట్టుకోవాలి..? ఎవరు ఏ పార్టీలో చేరాలి అనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు ఇవ్వకనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) స్పందించారు.
ప్రస్తుతానికి బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయంటూ కామెంట్ చేసారు. టీడీపీతో పొత్తు పైన స్పందించిన వీర్రాజు టీడీపీ -వైసీపీ పైన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో అమిత్ షా కాన్వాయ్ పైన జరిగిన రాళ్లదాడి గురించి వీర్రాజు ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఆలోచించాలని సూచించారు. బీజేపీ ఏపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. వైసీపీ – టీడీపీ రెండు దొంగ పార్టీలని విమర్శించారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.
జనసేనతో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏపిలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని వీర్రాజు విమర్శించారు. దేవాలయాలపై దాడులు జరిగిన పోలీసులు లైట్ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి .. ఏపికి అన్ని విధాలుగా నష్టం చేసిన వ్యక్తిగా వీర్రాజు పేర్కొన్నారు. వ్యక్తి ఇప్పుడు జోడో యాత్ర అంటూ ఏపిలోకి ప్రవేశించారని ఎద్దేవా చేసారు. ఏపీకి అన్ని విధాలుగా అబివృద్దికి కేంద్రం సహకరిస్తుందని వీర్రాజు వివరించారు. రాజకీయ వికేంద్రకరణ పేరుతో వైసీపీ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. అమరావతి రాజదానికి కేంద్రం కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేసారు. ఏపీలో వివాదాలతో వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి నోచుకోవడం లేదని పేర్కొన్నారు.
కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వాఖ్యలపై తాను స్పందించలేనన్నారు. జనసేనాని కి వైజాగ్ జరిగిన విషయంలో బీజీపీ పూర్తి మద్దతు ఇచ్చిందని వివరించారు. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో కలిసింది ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కలిశారన్నారు. పొత్తుల విషయం పవన్ కళ్యాణ్..చంద్రబాబు మధ్య రాలేదని వీర్రాజు చెప్పారు. తాను తమ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతానని వివరించారు. తాను చాలా క్లియర్ కట్ స్పష్టంగా ఉన్నానని వీర్రాజు పేర్కొన్నారు.