ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Andhra Pradesh: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విచారణకు చంద్రబాబు సహకరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ఈ కేసుపై 2022లో ఎస్ఎల్పీ దాఖలైంది. అందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా?’’ అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా? అని ఆరా తీసింది. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు.
సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి అందజేశారు. ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో చంద్రబాబునాయుడికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీ నరేష్‌లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చి పలు షరతులు విధించింది.