ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో… ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అని ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే.. ఈ విషయంలో బీజేపీ నేత సునీల్ దేవధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏపీలో కుటుంబ పార్టీలతో చేతులు కలపేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. కుటుంబ వారసత్వ పార్టీలతో బీజేపీ కలిసే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహ బాధ్యుడు, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ తెగేసి చెప్పారు. జనసేనతో మాత్రమే ఏపీలో బిజెపితో పొత్తు ఉందని, వచ్చే ఎన్నికల్లో కేవలం జనసేనతో మాత్రమే ప్రయాణం చేస్తామని సునీల్ దేవదర్ ప్రకటించారు. అవినీతి కేసుల్లోను, కుటుంబ రాజకీయాలు నడపడం అంటే దేశానికి చీడ పురుగులు లాంటివని ఆ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదన్నారు.
ఎర్రకోట పై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కుటుంబ పార్టీల వల్ల నష్టాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈసందర్భంగా సునీల్ దేవదర్ ప్రస్తావిస్తు బిజెపి పొత్తులను కుటుంబ పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియాలు నిర్ణయించలేవన్నారు. ఏపీలో తెలుగుదేశం, వైసీపిల కు సమాన దూరం పాటిస్తున్నామని సునీల్ దేవదర్ వివరించారు.