మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ను లారీ వేగంగా ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. అయితే ఆ వ్యాన్ నుంచి కట్టల కట్టల డబ్బు సంచులు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Five people from Amalapuram died in an American road accident
Cash Caught in East Godavari : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ( AP polls) రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డబ్బు కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో డబ్బు సంచులు బయట పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బును సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విజయవాడ నుంచి విశాఖపట్టణం వైపు వెళుతున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ని(mini van) వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లి ఎర్ర కాలువ దగ్గర్లో జరిగింది. ఈ ప్రమాదం విషయమై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ వ్యానులో ఏడు కోట్ల రూపాయల డబ్బు ఉన్న సంచులు ఉండటాన్ని గమనించారు.
దీంతో అవాక్కైన పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నార? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదు. ఎన్నికల నేపథ్యంలో రోడ్లన్నీ రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ప్రజలు తరలి వెళుతున్నారు. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.