ATP: అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.