NTR: కంచికచర్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఏసీపీ తిలక్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచార ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. హుస్సేన్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో తన స్నేహితుడైన సిద్దు ఇంటికి తీసుకువెళ్లగా.. సిద్దు అత్యాచారం చేసినట్లు తెలిపాడు. అదే విధంగా ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.