KKD: నవరాత్రులు పూర్తికావడంతో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, కాకినాడ దేవాలయ వీధిలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారు తన నిజస్వరూపంతో వెండిచీర ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆలయ ఈవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు కార్తీక్ రామలింగేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి పూజలు నిర్వహించారు.