KDO: ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్లో నివాసం ఉంటున్న మహిళా లెక్చరర్ పల్లా మహేశ్వరి(22)శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చాపాడు మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న మహేశ్వరి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అక్క, బావ ఇంట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి ఎవరూ లేని సమయంలోఉరి వేసుకుంది. దీనిపై 1టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.