KKD: చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణించి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న సేవలకు గాను జిల్లా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.