E.G: చాగల్లులోని మసీదు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీటీసీ ఇంటి వీర్రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆయన సూచించారు. అలాగే పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని పేర్కొన్నారు.