PLD: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరని మాచర్ల సీఐ పచ్చిపాల ప్రభాకర్ రావు అన్నారు. తలకు గాయమై ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. మైనర్లు, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరమన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. హెల్మెట్ వాడటం విధిగా భావించాలన్నారు.