NTR: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ శనివారం కండ్రికలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో పీఎం సూర్యఘర్ పథకంపై అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకునే అవకాశం ఉందని, పర్యావరణానికి మేలు చేసే ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని ఉమ సూచించారు.