HYD: వినాయక చవితి సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆదివారం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్నారు.