ASR; జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అమిత్ బర్దార్, పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం కేసులు తగ్గాయన్నారు. ఈ ఏడాది 135 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయని, 14,484.38 కిలోల గంజాయి, 35.61 కిలోల హషీస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.