CTR: చౌడేపల్లెలోని అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో కొలిచి.. మొక్కులు చెల్లించారు. వారికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.