కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన భూముల ఫోర్జరీ స్కాం కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలతో అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు.