KDP: జమ్మలమడుగులోని స్థానిక మెయిన్ బజార్ కూడలిలో గుంతను పూడ్చి అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని DYFI జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు. శనివారం కూడలిలో ప్రమాదకరంగా ఉన్నగుంతను DYFI నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉండే కూడలి మధ్యలో గుంత ఉండటంతో వాహనదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.