కోనసీమ: అల్లవరం గ్రామంలో 2 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.