ATP: బీసీసీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అండర్-19 కూచ్ బెహర్ నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోటీకి అనంతపురం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 22 నుంచి 25 వరకు అనంత క్రీడాగ్రామంలో జరిగే పోటీని అనంతపురానికి కేటాయించారు. కూచ్ బెహర్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్ పోటీలో ఆంధ్ర జట్టు మహారాష్ట్ర జట్టుతో తలపడుతుంది.