W.G: ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.