E.G: తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో MGNREGS పథకం ద్వారా రూ. 6 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డుకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పన, పశుపోషణకు మద్దతు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.