కోనసీమ: తుఫాన్ ప్రభావం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మోస్తరు నష్టం వాటిల్లింది. మాడ వీధుల్లోని నిర్మించిన టెంట్‌కు సంబందించిన పరికరాలు ఈదురుగాలులకు దెబ్బతిన్నట్లు ఆలయ ఈవో చక్రధర్ రావు తెలిపారు. దెబ్బ తిన్న టెంట్ పరికరాలను మళ్లీ పునరుద్దరణ చేస్తున్నట్లు తెలిపారు.