E.G: గోకవరం మండలం కృష్ణుని పాలెంలో శనివారం ఓ కోతి మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు స్పందించి కోతిని తరిమివేశారు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.