NLR: అల్లూరు పట్టణంలోని రామకృష్ణ జూనియర్ కళాశాల పాఠశాల విభాగం ప్రధానోపాధ్యాయులు మువ్వా గంగిరెడ్డి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. 34 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.