ATP: బుక్కపట్నం మండల పరిధిలోని కృష్ణాపురం పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచారంపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు గ్రామస్థులతో విచారణ చేపట్టారు. బుక్కపట్నం ఎస్సై కృష్ణమూర్తి గురువారం అటవీశాఖ అధికారులు ఐజాక్, లలితమ్మలతో కలిసి గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు గ్రామస్థులకు సూచించారు.